
జనసేన పార్టీలోకి కార్యకర్తల చేరిక
జనసేన ప్రభుత్వం గత ఎన్నికల్లో పోటీ చేసి కేవలం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచినా ప్రజల్లో ఇంకా జనసేన పార్టీ మీద నమ్మకం ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పరాభవం పాలయినా, వెనువెంటనే ప్రజల సమస్యలను తీర్చడానికి ప్రజల ముందుకు రావడం గమనార్హం. పవన్ కళ్యాణ్ గారు పవర్ కోసం రాలేదు ప్రశ్నించడం కోసం, ప్రజల కష్టాలను తీర్చడానికి వచ్చాడు అని మనం కూడా గమనిస్తున్నాం. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతే జనసేన పార్టీకి బలం పెరగడం చూస్తున్నాం. అది అధికార పక్ష, ప్రతిపక్ష వైఫల్యాలు కలసి రావడం కూడా ఓక అంశం. దానికి తోడు జనసేన పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు వెలికి తీయడం, పరిష్కారం చేయడం కూడా జనసేనకు ఒక బలమైన అంశం. అనకాపల్లి మండలం దిబ్బ పాలెం గ్రామంలో జనసేన పార్టీ అనకాపల్లి ఇంచార్జ్ శ్రీ పరుచూరి భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో కొందరు యువకులు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎలాంటి సమస్య ఉన్న తనకు తెలియపరచమని అనకాపల్లి ఇంచార్జ్ అయినటువంటి శ్రీ పరుచూరి భాస్కర్ రావు గారు చెప్పడం జరిగింది.








