జనసైనికులు పోరాటంతో రోడ్లను మరమ్మత్తులు చేసిన ప్రభుత్వ అధికారులు

జనసైనికులు

     గుడివాడ  ( జనస్వరం ) : పట్టణ మినీ బైపాస్ రోడ్డు గుంతలమయంతో ప్రజలు వాహనదారులు ఇబ్బంది పడడంతో జనసైనికులు పోరాటంతో రోడ్డు మరమ్మతులు చేసిన ప్రభుత్వ అధికారులు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గుడివాడ పట్టణ మినీ బైపాస్ రోడ్డు గుంతలమయంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడడంతో ఆ సమస్యను గుర్తించి ఆ గొంతులో దిగి నిరసన కార్యక్రమం తెలియజేయడంతో ఆ సమస్యను ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి రోడ్లు మరమ్మతులు చేయడం జరిగింది ఆర్ అండ్ బి అధికారులకు మా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేశారు. అదే కాకుండా ఈ రోడ్లు శాశ్వత పరిష్కారం చేయాలని కోరారు. ఈ సమస్యను ప్రభుత్వాధికారులకు చేరవేసిన మీడియా మిత్రులకు పత్రిక విలేకరులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ జనసైనికులు ఉండి ఆ సమస్య తీర్చేదాక పోరాడుతామని ఇ పోరాట స్ఫూర్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో గుడివాడ పట్నంలో అనేక సమస్యల మీద పోరాడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్ నూనె అయ్యప్ప దివిలి సురేష్ కే కిరణ్ చరణ్ తేజ్ శివ మరియు జనసైనికులు పాల్గొన్నారు. 

See also  మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత డిమాండ్