భరణికం చింతపల్లి రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం

నెల్లిమర్ల, ఫిబ్రవరి 6, (జనస్వరం) : నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలో రహదారుల అభివృద్ధిలో భాగంగా భరణికం సెంటర్ నుంచి చింతపల్లి పంచాయతీ వరకు ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. నియోజకవర్గ శాసనసభ్యురాలు లోకం నాగ మాధవి ఆదేశాల మేరకు ఈ పనులు ప్రారంభమయ్యాయి. ప్రజల రవాణా ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. జనసేన పార్టీ మండల కోఆర్డినేటర్ జమరాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ బాసి దుర్గ, గోవిందపురం సర్పంచ్ బాల అప్పలరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూర్లే విజేయ్ శంకర్, కొలిచన శ్రావణ్, బర్రి తాతారావు, పిన్నింటి సంతోష్, రాయితి అప్పలరాజు, పాండ్రంకి వెంకటేష్, టంకాల రామోజీ, రాలి రమణ, పెద్దింటి వంశీ, పతివాడ వెంకటేష్, రోడ్డు కాంట్రాక్టర్లు, స్థానిక జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  రామ్ తాళ్లూరిని కలిసిన మర్రిపాడు జనసేన నాయకులు చిన్నా జనసేన