Search
Close this search box.
Search
Close this search box.

దిగ్విజయంగా తొలి విడత వారాహి విజయయాత్ర

వారాహి

అడుగడుగునా జన నీరాజనం
దారిపొడవునా స్వాగతం
అశేష జన వాహిని
అఖండ అభిమాన వాహిని

సంకల్పం గొప్పదైతే సాధన సాధ్యమే
           సమాజంలో, రాష్ట్రంలో మార్పు కోసం కంకణం కట్టుకొని జనం కోసం ఆశయం తో కదిలిన జనసేనాని వారాహి తొలి విడత యాత్ర ఉభయగోదావరి జిల్లాల్లో దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. పార్టీ శ్రేణులను బలోపేతం చేస్తూ స్థానిక నియోజక వర్గ అన్ని రంగాలపై ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి కదన రంగాన గాండీవం పట్టిన సవ్య సాచిలా ప్రశ్నలు సంధిస్తూ, జనసేన పార్టీ విధి విధానాలను షణ్ముఖ వ్యూహం గురించి వివరిస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవడంలో సఫలం అయ్యారు. అధికార పక్షం ఎన్ని డైవర్షన్ జిమ్మిక్కులు చేసినా, సినీ నటుడు కాబట్టి జనం వస్తున్నారు అనే వాదన తెర పైకి తెచ్చినా ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత, జనసేనాని పై ప్రజా నాయకుడిగా జనం ఏర్పరచుకున్న నమ్మకం స్పష్టంగా తెలుస్తుంది. జనవాణి ద్వారా సమస్యలు చెప్పుకోవడం ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో ప్రతీ సభకు హాజరు అవటం మార్పుకు సంకేతం. ఇక పట్టం కట్టిన ప్రజలకు బటన్ నొక్కి డబ్బులు పంచటం ఒకటే ఈ ప్రభుత్వం చేస్తుంది తిప్పలు పడి అప్పులు తెచ్చి పంచేసాం ఇంకేమి చేయనక్కర లేదు అనే స్థితిలో ఉంది. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు అన్ని ప్రజా సమస్యలపై, ప్రభుత్వ పని తీరుని ప్రశ్నిస్తుంటే, ముఖ్యమంత్రి ని ముక్కు సూటిగా విమర్శలు చేస్తుంటే ఎవరూ కాదని చెప్పట్లేదు తప్పు అని ఖండించట్లేదు పైగా పనికి మాలిన వ్యక్తిగత దూషణలు చేయటం తప్ప ఎప్పుడూ మగతనం, దమ్ము పదాలు వాడుతూ ఉంటారు అవే వీరికి కొదువ అని జనం ఆలోచించించే స్థాయికి వైసీపీ నాయకులు దిగజారి పోయారు. అడిగిన ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పగలిగే వాళ్లు లేరు అనేది స్పష్టం జవాబు చెప్పలేం కాబట్టి ఎదురు దాడి చేయాలి అన్నట్లు వుంది వారి తీరు. వారాహి విజయయాత్రలో జనసేనాని రోడ్ల దుస్థితి, అప్పుల్లో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, యువత సమస్యలు , అదుపుతప్పిన లా & ఆర్డర్, వైసీపీ గూండాగిరీ, రైతుల సమస్యలు, విద్య, వైద్య, వైద్య వ్యవస్థల దుస్థితి, కులాల మధ్య రాజేస్తున్న కుంపట్లు, ప్రభుత్వం తీసేసిన పథకాలు, దాని వలన ఇబ్బందులు పడుతున్న ప్రజా సమస్యలపై గళమెత్తారు. అభివృద్ధి జరగాలంటే, అరాచకాలు ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి.
జనం బాగుండాలంటే జగన్ పోవాలి

“హల్లో ఏపీ – బై బై వైసీపీ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

images (3)
మార్పు కోసం జనసేన
Volunteer
వాలంటీర్ల వ్యవస్థ - జనసేన గళం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ దూషణల పర్వం
IMG-20230205-WA0000
అభివృద్ధికి దూరం - అసమర్ధ ప్రభుత్వం
IMG-20230129-WA0002
ఎస్సీ, ఎస్టీ 'సబ్' ప్లాన్ ?

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way