SC, ST సబ్ ప్లాన్ నిధులను వినియోగించి రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పన తక్షణం చేపట్టాలి – జనసేన డిమాండ్.

SC, ST సబ్ ప్లాన్ నిధులను వినియోగించి రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పన తక్షణం చేపట్టాలి – జనసేన డిమాండ్.

        కడప నగర కమిటీ అధ్యక్షుడు మాలే శివ గారి నాయకత్వంలో జనసేన పార్టీ 18వ డివిజన్ ఇంఛార్జి అతికారి నాగేంద్ర ఆధ్వర్యంలో జనసేన పార్టీ బృందం AL కాలనీ పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా కడప నగర అధ్యక్షుడు మాలే శివ లీగల్ సెల్ నాయకులు తోట బాలసుబ్రమణ్యం మాట్లాడు కడప నగర కార్పొరేషన్ 18 వ డివిజన్ పరిధిలోని AL కాలనీ ఏర్పడి దాదాపు 20కి పైగా సంవత్సరాలు అవుతున్నప్పటికీ కాలనీలో మెజారిటీ ప్రజలు ఎస్. టి.లు అయినప్పటికీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వినియోగంలోకి తీసుకురాకుండా కార్పొరేషన్ అధికారులు AL కాలనీని మురికి కూపంగా మార్చారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏ ఎల్ కాలనీ కి ఇన్ని సంవత్సరాల పాటు కనీస మౌలిక వసతులు అయినటువంటి మురికి కాలువలు రోడ్లు ఏర్పాటు చేయలేకపోవడం కార్పొరేషన్ అధికారులకు ST వర్గానికి చెందిన ప్రజల పైన ఉన్న నిర్లక్ష్య వైఖరే కారణమన్నారు. ఒకపక్క ప్రభుత్వం వన్ ఎస్ సి ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ద్వారా సదరు ప్రజలు నివసిస్తున్న అటువంటి ప్రాంతాలలో/ కాలనీలలో వెనుకబాటుతనాన్ని పారద్రోలి అభివృద్ధి చేయడానికి కోట్లాది రూపాయల నిధులను కేటాయిస్తూ ఉన్నప్పటికీ సదరు నిధులను వినియోగించే ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో లో కడప నగరపాలక సంస్థ వైఫల్యం చెందిందని విమర్శించారు.

        ఒకపక్క కడప నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ సీజనల్ వ్యాధులకు అవకాశం ఉన్న సమయంలో పారిశుద్ధ్యం చర్యలను తప్పనిసరిగా తీసుకోవాల్సిన టువంటి నగరపాలక సంస్థ ST ప్రజలు నివసిస్తున్న అటువంటి ఈ AL కాలనీ పై వివక్ష చూపించడం ఉపేక్షించరాని నేరం అన్నారు. ఇప్పటికైనా కడప నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఏ ALకాలనీ ప్రజల కష్టాలను గుర్తించి కాలనీలో అవసరమైనటువంటి రోడ్లు మురికి కాలువలు పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను తక్షణం కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నగర పార్టీ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసన్న, కార్యదర్శి కే.సురేష్ బాబు, సందీప్ , తిరుపాల్ నాయక్, గిరి, శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

See also  భవన నిర్మాణ కార్మికుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించవా ? కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రేఖగౌడ్