
ధర్మవరం, అక్టోబర్ 17, (జనస్వరం) : శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ‘అనంత క్రైమ్ స్టోరీ – 2026 నూతన సంవత్సర క్యాలెండర్’ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, నేరాలపై అవగాహన పెంపొందించడం, సమాజంలో చైతన్యం తీసుకురావడంలో అనంత క్రైమ్ స్టోరీ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను మరింత వైభవంగా నిర్వహించగా, సంక్రాంతి సంబరాల నడుమ క్యాలెండర్ ఆవిష్కరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో అనంత క్రైమ్ స్టోరీ ఎడిటర్ నాగేంద్ర యాదవ్‌తో పాటు బీజేపీ, టీడీపీ నాయకులు గిర్రాజు నాగేష్, జింక చంద్ర, సాకే ఓబులేసు, గొట్లూరు అనిల్, ఫణి కుమార్, కమతం కాటమయ్య, నాగూర్ హుస్సేన్, కేశగాల్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.









