పుట్టపర్తి అభివృద్ధికి 30 కోట్లు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు

పుట్టపర్తి, అక్టోబర్ 29, (జనస్వరం) : పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ ద్వారా 30 కోట్ల రూపాయలు విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీశ్రీశ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించేందుకు మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల చేయడం జరిగింది. శతజయంతి ఉత్సవాల్లో దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే దృష్ట్యా, రోడ్ల మరమ్మత్తులు మరియు కొత్త రోడ్ల ఏర్పాటుకు ఈ నిధులు కేటాయించారని అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని, పుట్టపర్తి ప్రజల తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పుట్టపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్ తెలిపారు.

See also  వ్యవస్థలను అడ్డుపెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం అవివేకం