
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన గుంటూరు జిల్లా టిడిపి నాయకులు తాళ్ళ వెంకటేష్ యాదవ్.
వెలగపూడి,డిసెంబర్09.( జనస్వరం)
గుంటూరు జిల్లా టిడిపి నాయకులు తాళ్ళ వెంకటేష్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి కావేటి విజయానంద్ యాదవ్ ని కలిసి రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని మెచ్చుకుంటూ, ప్రభుత్వం వారు వారి సేవలను మరింతగా వినియోగించుకునేందుకు మరో మూడు నెలల కాలం పాటు పదవీకాలాన్ని పొడిగించినందుకు శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేయటం జరిగినది.
తాళ్ళ వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ గుంటూరు జిల్లా ప్రజలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ ముఖ్యంగా
• గుంటూరు మిర్చి యార్డు ఆధునికీకరణ,
• అమరావతి – మంగళగిరి – గుంటూరు ప్రాంత అభివృద్ధి,
• గుంటూరు GGH ను సూపర్ స్పెషాలిటీగా అప్‌గ్రేడేషన్,
• పరిశ్రమలు, పర్యాటక రంగాలకు ప్రోత్సాహం,
• రోడ్లు, ట్రాఫిక్ సౌకర్యాల మెరుగుదల,
• వ్యవసాయ నీటి సమస్యల పరిష్కారం వంటి ప్రజా ప్రయోజన అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లాను.ముఖ్య కార్యదర్శి ఈ ప్రతిపాదనలను అభినందిస్తూ ప్రభుత్వ స్థాయిలో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.








