దెందులూరులో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం

దెందులూరు, మార్చి 29 (జనస్వరం) : దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని దెందులూరు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాన జరుగుతున్న టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా “దెందులూరు మండలంలోని పాతకమ్మవారిగూడెం, కొత్త కమ్మవారిగూడెం, రామారావు గూడెం లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  వాకతిప్ప, ఉప్పాడ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న రావు అక్షయ్