కాపులకు ఇస్తానన్న హామీలని నెరవేర్చాలని తెలంగాణ జనసేన నాయకుల డిమాండ్

తెలంగాణ

        హైదరాబాద్ ( జనస్వరం ) :  కూకట్పల్లి నియోజకవర్గంలో బాల్ నగర్ కాపు సేవా సమితి అధ్యక్షులు తోట శివాజీని, జనసేన పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ గారి మిత్రబృందంతో, జనసేన పార్టీ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. శంకర్ గౌడ్ మాట్లాడుతూ అన్ని కులాలకు భూమి కేటాయించారు. కానీ, కాపులకి ఐదు ఎకరాల భూమి ఇస్తామని గత ఎలక్షన్స్ ముందు నుంచి మభ్యపెడుతూ వస్తున్నారు. ఈ ఆరు నెలల్లో ఇవ్వని పక్షంలో ఎలక్షన్స్ లో జనసేన పార్టీ క్యాండిడేటెడ్ గెలిచిన తర్వాత 10 ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి డివిజన్ ప్రెసిడెంట్ నాగరాజు, వెంకటేశ్వరరావు, నాగేంద్ర, కోలాశంకర, వేముల మహేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.

See also  విశాఖ పశ్చిమ జనసేన నాయకులు పీలా రామకృష్ణ గారి చొరవతో ఆసరా ఫౌండేషన్ సహకారంతో 50 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ఏర్పాటు