
మత్స్యకార ప్రజలకు అండగా పోరాడుతున్న టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్
భావనపాడుపోర్టు భూముల సేకరణ నుండి సెలగపేట చెరువుల (మర్రిపాడు పంచాయతీ, సంతబొమ్మలి మండలం) మినహాయింపును ఇవ్వాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకొన్నా ఫలితం లేదు. స్థానిక జనసేన కార్యకర్తలు టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ కుమార్ గారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కణితి కిరణ్ కుమార్ గారు ఆ గ్రామ ప్రజలను కలసి ఈ విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మర్రిపాడు పంచాయతీ, సంతబొమ్మలి మండలం గ్రామంలో నివసిస్తున్న గ్రామ ప్రజలు వృత్తి పరంగా చేపల వేట, ఉప్పు దాని అనుబంధ పరిశ్రమలలో కూలీలగాను, వ్యవసాయ కూలీలగాను, జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం భావనపాడు పోర్టు నిర్మాణంలో భాగంగా చేపడుతున్న సర్వేలో సెలగపేట గ్రామానికి చెందిన మూడు చెరువులు, చెరువు వెనుక భాగంలో ఉన్న కొంత వ్యవసాయ భూములను సుమారుగా 80 ఎకరాలను సర్వే జరిపించినారు. సెలగపేట గ్రామస్థులు పైన తెలిపిన 3 చెరువుల (ధర్మ కోనేరు, కొత్తమ్మ చెరువు, కోమటి చెరువు) నీటిని ఇంటి దైనందిక అవసరాలకు, పశువుల వాడకం కొరకు ఉపయోగిస్తున్నారు. కావున సెలగపేట గ్రామానికి ఆనుకొని ఉన్న సర్వే భూములను, 3 చెరువులను పోర్టు భూముల సేకరణ నుండి మినహాయించవలసినదిగా కోరుచున్నమని కణితి కిరణ్ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ఈ సమస్య పై స్పందించి సెలగపేట గ్రామంలో గల 3 చెరువులను, 80 ఎకరాల వ్యవసాయ భూములను పోర్టుభూముల సేకరణ నుండి మినహాయింపు ఇచ్చి న్యాయం చేయవలసిందిగా టెక్కలి జెనసేన పార్టీ నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.









