విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన 4 ఇళ్లు కాలి బూడిదయిపోవటంతో సహాయం చేసిన టెక్కలి జనసైనికులు

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన 4 ఇళ్లు కాలి బూడిదయిపోవటంతో సహాయం చేసిన టెక్కలి జనసైనికులు

                   స్థానిక టెక్కలి టౌన్ ఆది ఆంధ్ర వీధిలో ఈ రోజు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన 4 ఇళ్లు కాలి బూడిదయిపోవటంతో సంఘటన స్థలాన్ని జనసేన పార్టీ నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈ సంఘటన పై వారు వెంటనే స్పందిస్తూ జనసేన పార్టీ తరుపున తక్షణ సహాయం కింద బియ్యం, నిత్యవసర సరుకులతో పాటు చీరలు, దుప్పట్లును బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని ఈ నాలుగు కుటుంబాలను ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రాయి సునీల్, హనుమంతు దిలీప్, పాసుపురెడ్డి సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.

See also  చిత్తూరు జిల్లాలోని రుయా ఆసుపత్రిలో 24 ఆక్సిజన్ సిలెండర్లు పంపిణీ చేసిన జనసైనికులు