టీం సైనిక JSP Indo – NRI ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శానిటరీ వర్కర్ల పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

టీం సైనిక

                         సౌదీ NRI శ్రీ అమీర్ ఖాన్ రధసారథిగా టీం సైనిక JSP Indo – NRI ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. హైదరాబాద్ వింగ్ కోర్ కమిటీ మెంబర్లు గోవర్ధన్, సుదర్శన్ & P.శ్రీదేవి (TS వీర మహిళా విభాగం, స్టేట్ సెక్రెటరీ) గార్ల ఆధ్వర్యంలో సికింద్రాబాద్, అల్వాల్ డివిజన్ లోని శానిటరీ వర్కర్ల పేద కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. జనసేనపార్టీ సిద్దాంతాలలో భాగమైన పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలను పంపిణీ చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి టీం సైనికా ముఖ్య కమీటీ శ్రీ మారిసెట్టి అజయ్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జనసేన వీరమహిళలు కావ్య, నీహారిక, రత్న పిళ్లై, జ్యోతి రమ్యా, భాగ్య లక్ష్మి, వెంకటలక్ష్మి, జనసేన నాయకులు నాగేంద్ర, కోలా శంకర్, రవీంద్రనాథ్, వేంకటేశ్వర రావు, శశిధర్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

See also  ఎడ్యుకేషన్ ట్రస్టు సేవలు ఎంతో ఉపయోగకరం - జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పొతిన వెంకట మహేష్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి