పాలెం గ్రామంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కిర్లంపూడి, మార్చి 29 (జనస్వరం) : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ జెండాను నాయకులు, కార్యకర్తల సమక్షంలో అంగరంగ వైభవంగా ఎగురవేసి ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కిర్లంపూడి మండలం పాలెం గ్రామంలో కూడా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ పాఠంశెట్టి మురళీకృష్ణ, యువ నాయకుడు ఆళ్ల రవి కిషోర్ పాల్గొని టీడీపీ జెండాను ఎగురవేసి “జై తెలుగుదేశం”, “జోహార్ ఎన్టీఆర్” అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు ఆళ్ల శివబాబు, పోతుల సత్యనారాయణ, అడబాల కొండబాబు, దాడి సుబ్బారావు, ఆళ్ల మాణిక్యం, సమ్మిటి పాపారావు, నూకలమంతి సూరిబాబు, పాఠంశెట్టి కాపు, అడబాల పిరమాలయ్య, పోతుల శివ తదితర నాయకులతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

See also  ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జనసేన పార్టీని రౌడీ పార్టీ అనడం చాలా నీచమైన హేయమైన చర్య