గుంతకల్‌లో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ రక్తదాన శిబిరం

     గుంతకల్, అక్టోబర్ 15, జనస్వరం :  పట్టణంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని సామాజిక సేవా కార్యక్రమంగా భవ్యమైన రక్తదాన శిబిరం జరిగింది. రాష్ట్ర సాయిధరమ్ తేజ యువత అధ్యక్షులు పవర్ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో 120 మంది అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి గుంతకల్ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాతలను అభినందించారు. రక్తదానం చేయడం ఒక మహా యజ్ఞమని, రక్తదాతలు నిజమైన దేవుళ్లని ఆయన అన్నారు. జనహితం కోసం పద్మవిభూషణ్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో ముందుండే సాయి ధరమ్ తేజ్ అభిమానుల ఈ ప్రయత్నం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. రక్తదానం కొద్దిసేపు మాత్రమే పట్టినా అది మరొకరికి కొత్త జీవితాన్ని అందిస్తుందని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు.

    ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పామయ్య, చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, రామకృష్ణ, కొనకొండ్ల శివ, ఆటో రామకృష్ణ, మంజునాథ్, అమర్నాథ్, శివకుమార్, పరశురాం, బర్మశాల శేఖర్, కసాపురం నందా, అఖిల్ రాయల్, ధోని ముక్కల విజయ్, గాజుల రాఘవేంద్ర, ఆటో రామంజి, అల్లు రవి, సుబ్బయ్య, ధన, అజయ్, హరి, ఎర్రి స్వామి, రాజు, సత్తి, దాదు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవాస్ఫూర్తితో సాగిన ఈ “మెగా రక్తదాన శిబిరం” విజయవంతంగా పూర్తయింది.

See also  వర్తమాన సమాజం అంబేద్కర్ ఆశయాలను అవగతం చేసుకోవాలి : వాసగిరి మణికంఠ