
ఘనంగా సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు
నరసరావుపేట టౌన్ ఆగస్ట్ 09 ( జనస్వరం)
స్థానిక చిలకలూరిపేట రోడ్డులో గల అమ్మ – నాన్నల ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలోని ఆవరణలో ది.టౌన్ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ-మహేష్ బాబు యువశక్తి పట్టణ అధ్యక్షుడు MD.ఫారూఖ్ బాబు ఆధ్వర్యంలో యూనివర్సల్ సూపర్ స్టార్ మహేష్ బాబు 51వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బులియన్ మర్చంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కపలవాయి విజయకుమార్ పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి అక్కడి వృద్ధులకు, పిల్లలకు పంచిపెట్టారు.అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన అన్నదానం( బిర్యానీ) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా రాణించటమే కాక,సుమారు ఏడువేలకు పైగా గుండె ఆపరేషన్లు చేయించి ఆ పసి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని, దేవుడు ఆయనకు ఆయురారోగ్యా లతో పాటుగా చల్లగా చూడాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు కు 51వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.పట్టణ అధ్యక్షులు ఫారూఖ్ బాబు మాట్లాడుతూ ఇటువంటీ సేవా కార్యక్రమాలే కాకుండా మన పట్టణంలో మాజీ మంత్రి వర్యులు కాసుకృష్ణారెడ్డి ఆశీస్సులతో, పొన్నపాటి ఈశ్వరరెడ్డి,కపలవాయి విజయకుమార్ సహాకారంతో పట్టణంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలను కుంటున్నట్లు తెలియజేశారు. మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు మా అభిమాన సంఘo ద్వారా చేయడమే గాక సంఘంలో మంచి గుర్తింపు పొందాలనుకుంటునట్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అభిమానులు బి.కొండాలరావు, లింగంగుంట్ల రాములు, కందుకూరి దిలీప్, షేక్ సుభాని,యన్నం వీరారెడ్డి, ఫోటోగ్రాఫర్ చిన్నికృష్ణ , షేక్ నబీ బాజీ, యన్.గోపికృష్ణ, యన్.జయ కృష్ణ ,షేక్. సుభాని R.M.P., ప్రిన్స్ బాషా, షేక్ మీరావలి, కుక్కల పాలు, సాగర్, మన్నేపల్లి శ్రీను, జి.వెంకీ బాబు, కె.రమేష్ బాబు మరియు వృద్ధాశ్రమ నిర్వహకులు ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.








