మాజీ సర్పంచ్ పొన్నపాటి ఈశ్వర రెడ్డి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సూపర్ స్టార్ కృష్ణ సీనియర్ అభిమానులు

లింగంగుంట్ల రజతోత్సవ మాజీ సర్పంచ్ పొన్నపాటి ఈశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు.

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సూపర్ స్టార్ కృష్ణ సీనియర్ అభిమానులు.

నరసరసరావుపేట రూరల్ ,మే 10 ( జనస్వరం)

లింగంగుంట్లలోని పల్నాడు జిల్లా S.P. ఆఫీసు ఎదురుగల గ్రామ రజతోత్సవ మాజీ సర్పంచ్ పొన్నపాటి ఈశ్వరరెడ్డి స్వగృహంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినవి. ముందుగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి ఆయన అభిమానులకు పంచిపెట్టారు. మాజీ సర్పంచ్ పొన్నపాటి ఈశ్వరరెడ్డి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ఆయన నరసరావుపేట కళావేదిక అధ్యక్షులు కూడా కొనసాగుతున్నారు.ఈ సందర్భంగా హీరో కృష్ణ – మహేష్ బాబు యువశక్తి పట్టణ అధ్యక్షులు MD.ఫారూఖ్ బాబు ఆద్వర్యంలో ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో లింగంగుంట్ల మాజీ సర్పంచ్ పొన్నపాటి విజయ కృష్ణారెడ్డి తో పాటు హీరో కృష్ణ మహేష్ బాబు సీనియర్ అభిమానులు షేక్ నబీబాజీ, మన్నేపల్లి శ్రీనివాసరావు,బి. మస్తాన్ రావు,షేక్ నాగుర్ వలి, సాగర్,డి.నాగేశ్వరరావు,చింతలపాటి చిన్నికృష్ణ ,షేక్ అబ్దుల్ సలాం తదితరులు పాల్గొన్నారు.

See also  చేబ్రోలు మండలం జనసేనపార్టీలోకి పలువురు యువకులు చేరిక

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి