విజయనగరంలో విజయవంతంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరం

విజయనగరంలో విజయవంతంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరం

                 జనసేన పార్టీక్రియాశీలక సభ్యత్వాలు విజయనగరం నియోజకవర్గ పరిధిలో పార్టీ ఆదేశం మేరకు చాలా జోరుగా సాగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జనసేన పార్టీ నాయకులు,జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో స్థానిక తోటపాలెం, సత్య కాలేజీ వద్ద పార్టీ క్రియాశీలక సభ్యత్వనమోదు శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు బాలు మాట్లాడుతూ జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరానికి ప్రజలనుంచి మంచి స్పందన వస్తుందని, కార్యకర్తల రక్షణ బాధ్యత కేవలం జనసేన పార్టీ తీసుకుంటుందని, ఈ అవకాశాన్ని అభిమానులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తాతపూడి రామకృష్ణ గారు, అడబాల వెంకటేష్ నాయుడు గారు,దాసరి యోగేష్, పివి. సత్యనారాయణ మూర్తి గారు, జోగారావు గారు, ఏ. ఈశ్వరవు గారు, జిల్లా చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి చెల్లూరి ముత్యాల నాయుడు, బూడివాసు, కర్రోతు ప్రసాద్ పాల్గొన్నారు.

See also  పెళ్లిళ్లు పెళ్ళాల గురించి మాట్లాడే జగన్ రెడ్డి  నువ్వు ముఖ్యమంత్రివా ? పెళ్లిళ్ల బ్రోకర్ వా ?