అటవీ భూముల్లో అక్రమాల ఆరోపణలపై తీవ్ర విమర్శలు : మైఫోర్స్ మహేష్

మదనపల్లి, నవంబర్ 15, (జనస్వరం) : అటవీ భూముల కబ్జాలు, అసైన్డ్ భూముల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూములపై అనధికార కట్టడాలు వంటి అంశాలపై రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి కుటుంబంపై వస్తున్న ఆరోపణలను ప్రజలు తీవ్రంగా చర్చిస్తున్న సందర్భంలో, జనసేన నాయకులు ప్రభుత్వంపై విమర్శలు మళ్లీ ఉధృతం చేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ, మంగళంపేట అటవీ భూముల్లో 32.63 ఎకరాలు అక్రమాలకు గురైనట్లు కేసు నమోదు చేయబడిందని, ఆ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏ1గా, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఏ2గా, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఏ3గా పేర్లు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. భూకబ్జాల ఆరోపణలపై ముందుగా తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత సంబంధిత నాయకులపై ఉందని తెలిపారు. వారు పేర్కొన్నదాని ప్రకారం, ‘The Wild East’ పుస్తకంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గత చరిత్ర, స్మగ్లింగ్ ఆరోపణలు, అక్రమ వ్యాపారాల వివరాలు స్పష్టంగా రాశారని, ఆ పుస్తకం ఒకసారి చదివితే నిజాలు బయటపడతాయని అన్నారు. పవన్ కల్యాణ్‌పై వెగటు వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికీ లేదని హితవు పలికారు. అయితే తమపై నమ్మకం ఉంటే, భూ కబ్జాలు, మద్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్ ఆరోపణలపై స్వయంగా సిబిఐ దర్యాప్తిని కోరాలని, ప్రజల ముందుకు వచ్చి తమ పాత్రను వివరించాల్సిన బాధ్యత పెద్దిరెడ్డి కుటుంబంపై ఉందని వ్యాఖ్యానించారు. కేసులో ఎవరి పేర్లు ఎందుకు వచ్చాయో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు.

రాజంపేట పార్లమెంట్ పరిధిలో మదనపల్లి, తంబాలపల్లి, పుంగనూరు, పీలేరు ప్రాంతాల్లో భూములు కోల్పోయిన బాధితులందరూ ముందుకు రావాలని, తమ హక్కుల కోసం పోరాడాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. బాధితుల తరఫున పార్టీ నిలబడుతుందని, న్యాయం జరిగేలా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. త్వరలో మదనపల్లిలో పెద్దిరెడ్డి కుటుంబ భూకబ్జాలు, దౌర్జన్యాలపై ‘జన వాణి’ కార్యక్రమం నిర్వహించేందుకు జనసేన హైకమాండ్ అనుమతి కోరతామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జనవాణి కార్యక్రమాల తరహాలో మదనపల్లిలో కార్యక్రమం నిర్వహిస్తే, అన్యాయానికి గురైన ప్రతి బాధితుడు స్వయంగా సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంటుందని పార్టీ అభిప్రాయపడుతోంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిరంజీవి రెడ్డి ప్రసాద్, మహిళా నాయకురాలు శోభ సునీత తదితరులు పాల్గొన్నారు.

See also  మదనపల్లి జిల్లా కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన నాయకులకు మద్దతు తెలిపిన జనసేనపార్టీ కార్యదర్శి దారం అనిత