రోడ్ భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు : సీఐ ధనుంజయ రావు

యలమంచిలి, ఫిబ్రవరి 27 (జనస్వరం) : మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం యలమంచిలి సీఐ ధనుంజయ రావు ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వద్ద ఓవర్ స్పీడ్ తో వెళ్తూ హాల్ చల్ చేస్తున్న ఇద్దరు బైక్ రైడర్స్ ను రురల్ ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ సిబ్బంది పట్టుకున్నారు. వారికి సీఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఒక్కరికి రూ.5035 చొప్పున మొత్తం రూ.10070లు జరిమానా విధించారు. ఎవరైనా రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా ట్రాఫిక్ రూల్స్ ని వ్యతిరేకించినా, ఆకతాయి పనులకు పాల్పడి ప్రజల సౌకర్యాలకు భంగం కలిగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

See also  అంబేద్కర్ జయంతి సందర్భంగా డొక్కా సీతమ్మ ఆహార నిధి ద్వారా అన్నదానం