జనవాణి కార్యక్రమాన్ని ఆపినా, జనసేనపార్టీ బలోపేతాన్ని ఆపలేరు : మత్స పుండరీకం

మత్స పుండరీకం

         పాలకొండ ( జనస్వరం ) :  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వేదికగా చేపట్టిన జనవాణి జనసేన, ఉత్తరాంధ్ర జిల్లా జనసేన పార్టీ నాయకుల సమావేశాలను జరగకుండా చేశామని వైస్సార్సీపీ నాయకులు సంబర పడవొద్దు ముందుది ముసళ్ళ పండుగ మరిచిపోవొద్దు అని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు మత్స పుండరీకం అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని నఅణచాలనే ఆలోచనతో వైస్సార్సీపీ నాయకుడు జగన్ చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పేరు విన్న జగన్ కి గుండెల్లో దడ పుడుతుంది. నేడు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పార్టీ జనసేన అని జనవాణి ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వంకి పరోక్షంగా సహకరిస్తుంది. నేడు రాష్ట్రంలో జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అరెస్టులతో ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ బలాన్ని, బలగాన్ని, బలోపేతాన్ని ఆపలేరని అన్నారు. మరికొద్ది రోజుల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉత్తరాంధ్ర జిల్లాలో ఉంటుంది అని, జనసైనికులు నిరుత్సాహ పడవలసి అవసరం లేదని మత్స. పుండరీకం అన్నారు.

See also  ఉరుసు మహోత్సవంలో జనసేన నాయకులు పోతిన మహేష్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి