డెలివరీ మహిళలకి కోవిడ్ టెస్ట్స్ లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి

డెలివరీ మహిళలకి కోవిడ్ టెస్ట్స్ లు అందుబాటులో ఉండేలా చర్యలు  తీసుకోవాలి. 

      జగ్గయ్యపేట నియోజకవర్గం పట్టణంలో ఉన్నటువంటి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు మరికొన్ని అత్యవసర సేవల విషయంలో చర్యలు తీసుకోటం లేదు అని జనసేన పార్టీ వారి దృష్టికి వచ్చింది. అని, ప్రజల బాగోగుల దృష్ట్యా తగు చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ తరుపున స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ అధికారి వారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింగి. ఈ కార్యక్రమంలో ఈమని కిషోర్ కుమార్ మాట్లాడుతూ మహిళలకు డెలివరీ ల విషయంలో డేట్స్ ఇచ్చినప్పటికీ వారు ఆ సమయానికి హాస్పిటల్ కి వెళ్ళినపుడు హాస్పిటల్ సిబ్బంది మాములు డెలివరీ అత్యవసరం అయితే చేస్తాం అనటం జరుగుతుందని, సీజేరియన్ అయితే విజయవాడ తీసుకుని వెళ్ళమని చెప్పటం లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అని, అత్యవసరం అయినపుడు వారు డెలివరీలు మాములు ప్రైవేట్ హాస్పిటల్స్ లో జాయిన్ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నపటికీ, ఫలానా ప్రైవేట్ హాస్పిటల్ వారు డెలివరీ వారికి సంబంధించిన కోవిడ్ రిపోర్ట్ అడుగుతున్నారు అని మా దృష్టికి వచ్చింది. మరి ఆ కోవిడ్ కి సంబంధించిన టెస్ట్స్ అనేవి డెలివరీకి దగ్గరలో ఉన్న వారు చేయించుకోవాలి అనుకున్నప్పటికి,  మన స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు కోవిడ్ కి సంబందించిన టెస్ట్స్ చేయటం లేదు అని ఆయన తెలిపారు. మరి మీరు వీటి యందు దయ ఉంచి తగు చర్యలు తీసుకుని కోవిడ్ టెస్ట్స్ జరిగేలా చూసి మరి సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాల్సినదిగా తెలిపి డెలివరీ డేట్స్ ఇచ్చిన ఆడవాళ్ళ విషయంలో కూడా సహకరించిన వారు అవుతారని జనసేన పార్టీ తరుపున కోరుచున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాషా , తరుణ్ , త్రిశాంత్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

See also  యువశక్తి పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ రేఖా గౌడ్