పేదలకు ఎన్టీఆర్ భరోసా ఫించన్ పంపిణీ చేసిన రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఉమేష్ రావు.

పొద్దు పొద్దున్నే పేదల సేవలో ఎన్డీయే –డా.యం.ఉమేష్ రావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి.

శ్రీకాళహస్తి. ఆగస్ట్ 01( జనస్వరం)

గత వైసిపి పాలనలో అటు సంక్షేమం పరంగా, ఇటు అభివృద్ధి లోనూ తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి సంక్షేమం మరియు అభివృద్ధి ఫలాలను అందించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం పొద్దు పొద్దున్నే పేదల సేవకు ప్రతీ పౌరుడి దగ్గరకు వెళుతోందని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పింఛన్ల పంపిణీ కార్యక్రమాలను ప్రతీ నెల ఒకటో తేదీన అమలు చేస్తూ ప్రజలకు నిస్వార్థ సేవలు అందిస్తోందని, అందులో భాగంగానే శనివారం శ్రీకాళహస్తి పట్టణం,18 వ వార్డు, కొత్త కోనేరు యస్టీ కాలనీకి చెందిన లబ్ధిదారులకు పింఛను పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, బిజెపి మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.
గత వైసిపి ప్రభుత్వ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని.. పియం నరేంద్ర మోదీ,డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ సహకారం మరియు ప్రోత్సాహంతో సియం చంద్రబాబు నాయుడు పునర్నిర్మాణం చేశారని, అందులో భాగంగానే ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ ఉక్కు పరిశ్రమలు సాధించడం జరిగిందని తెలిపారు.
రూ.4,727 కోట్ల వ్యయంతో 2,703 ఎకరాల్లో రూపుదిద్దుకున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థకు సరికొత్త గ్రోత్ ఇంజిన్‌గా మారబోతోందని, 3,800 మీటర్ల సుదీర్ఘ రన్‌వేతో బోయింగ్ 777, డ్రీమ్‌లైనర్, ఎయిర్‌బస్ A330 వంటి భారీ అంతర్జాతీయ విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా భోగాపురం రూపుదిద్దుకుందని,భోగాపురం విమానాశ్రయానికి దగ్గరలోనే 500 ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్న ఏవియేషన్ హబ్ ద్వారా ఏకంగా రూ.20,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని, దీనివల్ల 60,000 ప్రత్యక్ష, 1.20 లక్షల పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లక్కమనేని మధుబాబు,బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్,మాజీ కౌన్సిలర్ షేక్ మహబూబ్ బాషా,శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ డి.వి.నారాయణ,గిరిజన విభాగం నాయకుడు తుపాకుల ప్రసాద్,గంగయ్య, తెలుగు మహిళా నాయకురాలు కె.విజయ, మణెమ్మ,సచివాలయ అధికారి ఫర్హానా తదితరులు పాల్గొన్నారు.

See also  పవనన్న సీఎం కావాలని అల్లాకి దువా చేయండి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి