రాష్ట్రాభివృద్ధి పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం : కిరణ్ రాయల్

కిరణ్ రాయల్

      తిరుపతి, (జనస్వరం) : రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తిరుపతి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ చార్జి కిరణ్ రాయల్ అన్నారు. శుక్రవారం ఆయన ప్రెస్ క్లబ్ లో జనసేన పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, నేతలు బాబ్జి, ముక్కు సత్యవంతుడు, హేమ కుమార్, సుమన్ బాబు, రాజేష్ ఆచారి, రమేష్ నాయుడు, కిషోర్, హేమంత్, వినోద్ రాయల్, తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేదిశగా కృషి చేస్తూ, నేడు రాష్ట్ర పాలక పార్టీ (వైసిపి) కుట్రను భగ్నం చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను తమ పవన్ కళ్యాణ్ పోరాటం వలన కాపాడుకున్నామని తెలిపారు. ఈ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ఢిల్లీ అధిష్టానంతో చర్చలు జరిపి విజయం సాధించారని జనసేనానిని ప్రశంసించారు. విశాఖ స్టీల్ ప్లాంటును అమ్మాలనుకునే సీఎం జగన్ రాజకీయ కుతంత్రాలను విమర్శిస్తూ జనసేన నాయకులు ఎండగట్టారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలను నమ్మించి మోసం చేసే కుట్రలకు స్వస్తి పలికి పాలన చేయాలని హితవు పలికారు. కేంద్రాన్ని ఎదిరించే సత్తా లేని జగన్ కనీసం సామరస్యంగా అయినా చర్చలు జరిపి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. విభజన హామీలు కొండేక్కాయని, ప్రత్యేక హోదా తేలేని జగన్ రెడ్డి పాలనకు అనర్హుడని వ్యాఖ్యానించారు.

See also  మాడుగుల నియోజకవర్గంలో జనసేనపార్టీ తరపున బెంచీలు పంపిణీ