గాజువాక నియోజకవర్గం 88 వ వార్డులో జనసైనికుల ఆత్మీయ సమావేశం

    గాజువాక నియోజకవర్గం, 88 వ వార్డుదువ్వాడ సెక్టర్ 1 గ్రామ యందు వార్డు గౌరవ అధ్యక్షులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమంపై జనసైనికుల ఆలోచనలు స్వీకరించడంతో పాటు క్రియాశీల ఐడిని పార్టీకి కష్టపడుతున్న వారిలో ఒకరైన టెంటు సురేష్ కుమార్ ఇవ్వడానికి ఏకగ్రీవంగా అంగీకారం తెలపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ అభ్యర్థి వబ్బిన జనార్ధనశ్రీకాంత్ గారు మాట్లాడుతూ ఇది ఒక బాధ్యత గా తీసుకొని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు జన సైనికులే జనసేన పార్టీ బలం అనే నినాదంతో వారికి ఆపదలో ఉన్నప్పుడు ఆరోగ్యరీత్యా 50 వేల రూపాయలు అనుకోకుండా జనసైనికునీ కోల్పోతే ఆ కుటుంబానికి భరోసాగా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ని ఇవ్వడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో మరింతగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనందరం కృషి చేయాలని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో దువ్వాడ మురళి, సూర్యనారాయణ, మంగళ పాలెం హనుమంత రావు, అప్పారావు, రమణ, రాజు, కాపు జగ్గరాజు పేట గల్లా రమేష్, యాదవ్ జగ్గరాజు పేట అశోక్, చలం, చిన్నారావు, దువ్వాడ జనసైనికులు, మరియు పెందుర్తి నియోజకవర్గ అజనగరి, ఈ గంగవరం, వెదుల్లు నరవ జనసైనికులు పాల్గొన్నారు.

ఇక నుంచి మీరు జనస్వరం న్యూస్ ఆప్ లో కూడా చదువుకోవచ్చు.. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
ఆప్ లింక్ : http://bit.ly/2Yi7zXn

See also  సిజి రాజశేఖర్ కు సత్కారం చేసిన పత్తికొండ జనసేన పార్టీ నాయకులు