సూళ్ళూరుపేటలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

సూళ్ళూరుపేట

      నెల్లూరు ( జనస్వరం ) : సూళ్లూరుపేట నియోజకవర్గం పెర్నాడు, కోరిడి, దామరాయి గ్రామాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు ఇన్సూరన్స్ కిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జనసైనికుల పిలుపు మేరకు ఆ గ్రామాల్లో జనసేన నాయకులు  పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది. ఒక్క 10kmల తారు రోడ్డు వారి చిరకాల కల అని ఆ గ్రామస్తులు తెలియజేశారు. రోడ్డు లేనందున అక్కడి పిల్లలు చదువుకు దూరమవుతున్నారన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు సరైన రవాణా సౌకర్యం లేక ఆ గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదయినా అత్యవరం అయినప్పుడు అంబులెన్స్ కూడా ఆ గ్రామాలకి వెళ్లలేని పరిస్థితి లేదన్నారు. పాలకులు ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తారు కానీ ఆ తరవాత మమ్మల్ని ఎవరు పట్టించుకోరని ఆ గ్రామ ప్రజలు బాధపడ్డారు. ఈసారి జనసేనకు అవకాశం ఇస్తే మీ సమస్యకి ఒక చక్కటి పరిష్కారం మేము చూపిస్తామని జనసేన నాయకులు హామీ ఇవ్వడం జరిగింది.  ఈ కార్యక్రమంలో కిరణ్ మండల ఉపాధ్యక్షుడు, మండల ప్రధాన కార్యదర్శి తీపలపూడి రమణ, మండల ప్రధాన కార్యదర్శి మేకల మురళి, సుబ్బరాజు తదితర జనసైనికులు పాల్గొన్నారు.

See also  రాజులమ్మకు ఆర్థిక సహాయం అందించిన జనసేన వీర మహిళ గౌరీ నాగలక్ష్మి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :