లక్కవరపుకోట మండలంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

లక్కవరపుకోట

        విజయనగరం ( జనస్వరం ) : లక్కవరపుకోట మండలంలో మండల నాయకులు రామెళ్ళ శివాజీ, రావాడ నాయుడు, షేక్ ఫిరోజ్, అలమండ రాంబాబు, పిల్లా సురేష్ అధ్వర్యంలో ఆత్మీయ సమావేశం చేయడం జరిగింది. ముందు ముందు పార్టీని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి గ్రామ స్థాయిలో ఎలా పార్టీ నీ బలోపేతం చేయాలి అన్న విషయాలు మీద ఈ మీటింగ్ జరిగింది.. జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ నాయకులు గొరపల్లి రవికుమార్, వేపాడ మండల అధ్యక్షులు సుంకరి అప్పారావు, పార్లమెంట్ కమిటీ ఎక్సక్యూటివ్ మెంబర్ జొన్నపల్లి సత్తిబాబు, కొత్తవలస మండల అధ్యక్షులు నక్కరాజు సతీష్, పార్లమెంట్ ఎక్సక్యూటివ్ మెంబర్ మల్లువలస శ్రీను, వెంకటేష్, గాలి అప్పారావు, పిల్లా రామదుర్గ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

See also  జనసైనికుల సంక్షేమమే జనసేన అధినేత ధ్యేయం : జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు)