పాలకొండ నియోజకవర్గములో జనసేన కార్యకర్తలు ఆత్మీయ సమావేశం

     పాలకొండ, (జనస్వరం) : జనసేనపార్టీ కార్యాలయంలో పాలకొండ నియోజకవర్గం నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కూరంగి నాగేశ్వరరావు పరిచయ వేదిక, నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితుల మీద చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో గర్భాన సత్తిబాబు, పాలకొండ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితుల మీద కూరంగి నాగేశ్వరరావుకి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేనపార్టీ నియోజకవర్గ నాయకులు కూరంగి నాగేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో మండలాలు వారిగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన సూచించారు. అలాగే పాలకొండ నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ 4 మండలాల జనసేన కార్యకర్తలు పార్టీని గ్రామ స్థాయిలో అభివృధ్ధికి కృషి చెయ్యాలని సూచించారు. అలాగే ఇప్పుడు వరకు పార్టీని కాపాడుకుంటూ వచ్చిన జనసైనుకులను ఆయన అభినందించారు.

See also  చనిపోయిన జనసేన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన చిత్తూరు జిల్లా జనసేన నాయకులు