కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

    కళ్యాణదుర్గం, (జనస్వరం) : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వముపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు తప్పకుండా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకున్న ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే హాస్పిటల్లో 50 వేల రూపాయలు, మరణించినట్లయితే 5 లక్షల రూపాయలు కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీ గురించి గ్రామ స్థాయిలోకి ప్రజలకి తెలియజేసే బాధ్యత మనందరం తీసుకొని క్రియాశీలక సభ్యత్వాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, జయ కృష్ణ, ఆంజనేయులు, ఈరన్న, రాజు, రామలింగ, కాంత రాజ్, మహేష్, వీర మహిళ షేక్ తార, జాకీర్, నరేష్, లక్ష్మణ్ జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.

See also  ఎన్నికల నిర్వహణ సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు రామా శ్రీనివాసులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి