బాపట్ల నియోజకవర్గంలో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

    బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గములో జనసేనపార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో మండల కమిటీ ఎన్నుకోబడిన వారికి ప్రమాణపత్రం ఇవ్వటానికి విచ్చేసిన రాష్ట్ర, జిల్లా నాయకులును బైక్ ర్యాలీతో స్వాగతం పలుకుతూ, మూర్తి నగర్ నందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ కార్యాలయం ప్రాంగణం నందు జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం పట్టణంలోని భీమవారిపాలెం ఉన్న వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలవేసి జెండాను ఆవిష్కరించి, అనంతరం తాలింఖాన సెంటర్లో పార్టీ జెండాను ఆవిష్కరించి అక్కడనుండి భారీగా ర్యాలీతో కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన బాపట్ల నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సన్మాన సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శిలు నయిబ్ కమల్, బేతపూడి విజయ శేఖర్ సంయుక్త కార్యదర్శు బండారు రవికాంత్, జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట మల్లిక, జిల్లా ప్రధాన కార్యదర్శిలు, కమతం విజయ్ కుమారి, నారదాసు రాంప్రసాద్, కొండ్రు కిరణ్, కార్యదర్శి నక్కల వంశీకృష్ణ, జిల్లా పార్టీ కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారి, సహాయ కార్యదర్శి నామన వెంకట శివన్నారాయణ, బాపట్ల మండల పార్టీ అధ్యక్షులు మోపర్తి శేషయ్య, కర్లపాలెం మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ, పిట్టలవానిపాలెం మండల అధ్యక్షుడు మెండు కార్తీక్, నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

See also  పలమనేరు నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి చేరిన టీడీపీ కార్యకర్తలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :