ఇంటింటా జనసేన కు విశేష స్పందన : జయరాం రెడ్డి

    అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటా జనసేన కార్యక్రమం. అనంతపురం నియోజకవర్గంలో…. భాగ్యనగర్, బిందువుల కాలనీ నందు నిర్వహించడం జరిగినది. కార్యక్రమంలో భాగంగా అనంతపురం నియోజకవర్గ ప్రజలతో మమేకమై జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో… ఆ ఆశయాలను వివరిస్తూ స్థానిక ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను, క్రియాశీలక సభ్యత్వ ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా ఈగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, భవాని నగర్ మంజునాథ్, వెంకటరమణ ప్రసాద్ బాల కార్తీక్, ముకుంద, వెంకట సాయి కృష్ణ, ధీరజ్, ఇమ్రాన్, వెంకటకృష్ణ, సాయి, ప్రవీణ్ కుమార్, రషీద్, నారాయణ నాయక్, సురేంద్ర, హేమంత్ నాయక్, వరప్రసాద్, కళ్యాణ్, కర్ణ , ప్రసన్న నాయక్ , రాజు, మహేష్ కుమార్, ప్రవీణ్ కుమార్, వెంకటకృష్ణ, ప్రణీత్ కుమార్, మహేశ్వర్ రెడ్డి ఈశ్వరయ్య, ఓబులేసు మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

See also  అన్నదానాలకు ఆదర్శం డొక్కా సీతమ్మ గారు : ఎమ్మిగనూరు జనసేన ఇంచార్జ్ రేఖ