మార్కాపురం పట్టణం నందు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించండి

     మార్కాపురం, (జనస్వరం) : ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం నందు జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్ అదేశాల మేరకు మార్కాపురం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు, అలాగే భారీ వాహనాలు సమయ పాలన లేకుండా పట్టణంలోకి రావడం వల్ల ట్రాఫిక్ సమస్యగా మారింది. మైనర్లు ఆటోలు, ద్విచక్ర వాహనాలు అతివేగంగా నడుపుతూ ప్రజలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అలాగే మూగ జీవులైన ఆవులను గాయపరుస్తున్నారు. దీని గురించి ఆర్డీవో కార్యాలయంలో సబ్ కలెక్టర్ సెధు మాధవన్  కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ నూనె సురేష్, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు వీరిశెట్టి శ్రీనివాసులు, చలపతి, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

See also  రెండేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారి విశ్లేషణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి