నిరాశ్రిత పిల్లలకి పాదరక్షలు అందించిన జనసైనికులు

జనసైనికులు

          కదిరి ( జనస్వరం ) : పట్టణంలోని మాధవ గురుకులంలో ఉన్న నిరాశ్రిత పిల్లలకి పాదరక్షలు లేవని మాధవ గురుకులం నిర్వాహకులు కదిరి జనసేన పార్టీ నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు పూల రాజేంద్ర ప్రసాద్, లక్ష్మణ కుటాల ఆ పిల్లలకు పాదరక్షలను  జనసైనికుల సహకారంతో అందించడం జరిగింది. వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పూర్తితో ప్రజాసేవ చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో ఇతరులకు సహాయపడాలని కోరారు.  

See also  9వ డివిజన్లో ఘనంగా ప్రారంభమైన పవనన్న ప్రజాబాట