టెక్కలి ఏరియా ఆసుపత్రికి ఆక్సిజన్ సిలెండర్ వితరణ చేసిన జనసైనికులు

టెక్కలి ఏరియా ఆసుపత్రికి ఆక్సిజన్ సిలెండర్ వితరణ చేసిన జనసైనికులు

              టెక్కలి జనసేన పార్టీ ఇంచార్జ్ కణితి.కిరణ్ గారు జన సేవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు టెక్కలి ఏరియా ఆసుపత్రికి ఎం సున్నాపల్లి జనసైనికుల సహకారంతో ఒక ఆక్సిజన్ సిలెండర్ ను ఆసుపత్రి సూపరిడెంట్ శ్రీ.కణితి కేశవరావు గారికి అందించారు. కణితి కిరణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని, అలాగే కరోనా బాధితులకి అండగా దాదాపుగా 640+  ఆక్సిజన్ సిలెండర్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సున్నాపల్లి జన సైనికులు ధనరాజ్ ,నారాయణ, రమేష్ ,కామేష్ ,టెక్కలి నియోజకవర్గ నాయకులు నర్సిపురం శేఖర్,ముడిదాన రాంప్రసాద్, గొనప చందు, కర్రి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

See also  వైసీపీ పతనానికి కౌంట్ డౌన్ మొదలైంది