
సాయి నేత్రాలయం లేజర్ అండ్ పోకో సెంటర్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు.
నరసరావుపేట, ఏప్రిల్ 21 ( జనస్వరం)
పట్టణంలోని అరండల్ పేటలో మంగళవారం సాయి నేత్రాలయం లేజర్ అండ్ పోకో సెంటర్ నూతన భవన ప్రారంభోత్సవం మరియు గృహప్రవేశం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. సాయి నేత్రాలయం యాజమాన్యం ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే అరవింద బాబు హాజరై నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బంది, వైద్యులు, రోగులు ఆయనను స్వాగతించారు.సాయి నేత్రాలయం లేజర్ అండ్ పోకో సెంటర్ ఆధునిక సౌకర్యాలతో కూడిన కంటి వైద్య కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. నూతన భవనంలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ ప్రారంభోత్సవం నిర్వహించారు. గృహప్రవేశం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొనడం స్థానికుల్లో ఆనందం నింపింది.








