ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందన్న డాక్టర్ సింగరాజు సాయికృష్ణ

ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన – డాక్టర్ సింగరాజు సాయికృష్ణ.

సత్తెనపల్లి.డిసెంబర్17.(జనస్వరం)

సత్తెనపల్లి రూరల్ మండలం భృగుబండ గ్రామంలో (సత్తెనపల్లి) సాయికృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో సింగరాజు చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.ఈ శిబిరంలో బీపీ, షుగర్, జ్వరాలు నెమ్ము, ఆయాసం, ఉబ్బసం,జలుబు, దగ్గు, థైరాయిడ్ సమస్యలు, మరియు అన్ని జనరల్ వ్యాధులకు ఊపిరితిత్తుల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేసి సుమారు 200 మందికి వైద్యసేవలు అందజేశారు.అలాగే అవసరమైన రోగులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్ సింగరాజు సాయికృష్ణ, డాక్టర్ సింగరాజు విద్య లకు భృగుబండ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ శిబిరంలో అన్నదాసు వెంకట్రామయ్య (మాజీ సర్పంచ్),తవిటి భావన్నారాయణ (సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు),పసుపులేటి కిరణ్ కుమార్, వరికూటి నాగరాజు,చందు శివ (మాజీ ఎంపిటిసి),చందు బుల్లోడు (జెడ్పీ హై స్కూల్ చైర్మన్),తోట వెంకటేష్ (ఫీల్డ్ అసిస్టెంట్),తులవ నరేంద్ర,షేక్ రఫీ మరియు భృగుబండ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

See also  జనసేన NRI సేవా సమితి కువైట్ ‌సేవలు అభినందనీయం : వడ్రాణం మార్కండేయ బాబు