ఎస్ ఐ వెంకటరావుకు జైలు శిక్ష వేయాలి : దివ్యాంగ జనసైనికుడు గోగన ఆదిశేషు

గోగన ఆదిశేషు

          బాపట్ల ( జనస్వరం ) :  పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన సందర్భంగా జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో గత మూడు రోజుల క్రితం మర్రిపాడు ఎస్ ఐ వెంకట్రావు  ఒక దివ్యాంగులు అయినా తిరుపతిని హింసించారని అన్నారు. ఆయన మరణానికి కారణమైన ఎస్ ఐ వెంకట్రావు పైన దివ్యాంగుల 2016 హక్కుల చట్టాన్ని సెక్షన్ 92ఏ. ప్రకార కఠినంగా శిక్షించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. దీనితో పాటు తిరుపతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో  ఇమ్మడి శెట్టిమురళి కృష్ణ, కంది వెంకట్ రెడ్డి, దేవి రెడ్డి శ్రీనివాసరావు, కుంట సూరయ్య తదితరులు పాల్గొన్నారు. 

See also  సమస్య కోసం పోరాటం చేసి విజయం సాధించిన జనసేన నాయకులు సుందరపు విజయ్ కుమార్