ఇరగవరం గ్రామం స్మశాన వాటిక అభివృద్ధి కోసం తణుకు ఇంచార్జ్ శ్రీ విడివాడ రామచంద్రరావు గారు రూ. 1, 11, 111/- సాయం

                   పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం ఇరగవరం గ్రామంలో స్మశాన వాటిక అభివృద్ధి పనులు నిమిత్తం తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ విడివాడ రామచంద్రరావు గారు తనవంతు సాయంగా 1,11,111 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ ఆశయాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని స్థానిక నాయకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తణుకు మండల పార్టీ ప్రెసిడెంట్ చిక్కాల వేణు మరియు నాయకులు బెజవాడ సూరి, పంతం నానాజీ మరియు ఇరగవరం గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

See also  పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వరద ముంపు ప్రాంత ప్రజలకు ఆహార పొట్లాలను పంచిన గొల్లప్రోలు జనసైనికులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :