లెక్కలు చూపించండి మంత్రి గారూ..? – దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లికి జనసేన పార్టీ అమ్మవారి ధార్మిక సేవ మండలి సూటి ప్రశ్న?

    విజయవాడ, (జనస్వరం) :  జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ అమ్మవారి ధార్మిక సేవ మండలి శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండలి సభ్యులు కరిమికొండ శివ రామకృష్ణ మాట్లాడుతూ 2020 దసరా ఉత్సవాల్లో సీఎం జగన్ రూ.70 కోట్లు ఆలయ అభివృద్ధికి మంజూరు చేసినట్లు తెలిపారు. ఇంతవరకు నిధులు వస్తే ఏ ఖాతాలో జమ అయ్యాయి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పాలకమండలి చైర్మన్, ఈవో సమాధానం చెప్పాలని, చీరల బహిరంగ వేలం పాటలో కూడా అమ్మవారి ఖజానాకు గండి పడిందని ప్రశ్నించారు. కరోనాకు ముందు ఏడాదికి దేవస్థానం వారే నిర్వహణ చేయడం వల్ల నాలుగు కోట్ల 70 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని, కరోనా సమయంలో రూ.కోటి 70 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని మరి ఈ ఏడాది బహిరంగ వేలం మూడు కోట్ల పది లక్షల రూపాయలకి వేయడం వలన అమ్మవారికి ఏడాదికి రూ.కోటి 60 లక్షల నష్టం అంటే రెండు సంవత్సరాల వేలానికి రూ.మూడు కోట్ల 20 లక్షలు అమ్మవారి ఆలయానికి చీరల ద్వారా నష్టం కాదా అని సూటిగా ప్రశ్నించారు. దీనిపై పాలకమండలి ఎందుకు స్పందించ లేదో అని అన్నారు. ఆలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు నేరుగా భర్తీ చేసే అధికారం ఆలయ ఈవోకి లేదని, సీఎం అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, దాని ద్వారానే భర్తీ చేయాలని తెలియజేశారు. ఇలా నేరుగా భర్తీ చేయడం అంటే సీఎం నిర్ణయాన్ని బేఖాతరు చేయడం కాదా అని అన్నారు. శానంపూడి శిరీష మాట్లాడుతూ కోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ శానిటేషన్ కాంట్రాక్ట్ ఖరారు చేసే విషయంలో నిబంధనలను పక్కదారి పట్టించి అడ్డగోలు నిర్ణయం ఈవో ఏ విధంగా తీసుకున్నారని, మంత్రి మాట ఈవోకి శిరోధార్యం అయిందని, సెక్యూరిటీ డొల్లతనంగా మారిందన్నారు. టీవీ9లో వార్త ప్రసారం అయితే ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారో భక్తులకు సమాధానం చెప్పాలని కోరారు. అమ్మవారి ఆలయంలో భక్తులకు వసతి ఏర్పాటు ఎందుకు చేయలేకపోతున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయం అయిన అమ్మవారి ఆలయానికి భక్తులు వసతికి కూడా నోచుకోలేక పోవడం మంత్రి వైఫల్యం కాదా అని ప్రశ్నించారు., ఆలయ అభివృద్ధి అంటే అమ్మవారి ఆదాయాన్ని దోచుకోవడమా? అని అన్నారు. అమ్మవారి ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.45 కొట్లపై కన్నేశారని, దసరా ఉత్సవాల ప్రారంభం నుండి ఉచిత ప్రసాదం, అన్నప్రసాద వితరణ ప్రారంబించాలన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు హ్యాండ్ శానిటైజేషన్, టెంపరేచర్ చెక్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. దసరా ఉత్సవాల్లో ఎటువంటి గందరగోళం లేకుండా భక్తులకు సౌకర్యవంతంగా అమ్మవారి దర్శన భాగ్యం కలిగించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని (పోలీస్, రెవెన్యూ, వీఎంసీ) అన్నారు. రాబోయే దసరా ఉత్సవాల్లో అమ్మవారి సొమ్మును తాత్కాలిక కాంట్రాక్టుల రూపంలో దోచుకోవడానికి మంత్రి వెల్లంపల్లి దండుపాళ్యం గ్యాంగ్ సిద్ధమైయ్యారని, ఈవో భ్రమరాంబ, మంత్రి సూచించిన వారికి కాంట్రాక్టులు కట్ట పెట్టొద్దని, ఏ కాంట్రాక్ట్ అయినా పారదర్శకంగా టెండర్లు ఖరారు చేయాల్సిందన్నారు. అమ్మ సొమ్మును కాపాడాల్సిందేనన్నారు. జమ్మి దొడ్డి ప్రాంగణంలో ఉన్న పరిపాలన ఆఫీసును ఆలయ ప్రాంగణంలోకి మారుస్తున్నారని అందువలన జమ్మి దొడ్డి భవనాలను మొత్తం యాత్రికుల బస కింద ఏర్పాటు చేయాలని సూచించారు. పరిపాలన విభాగాలు కోసం తాత్కాలిక కార్యాలయం కాదు.. శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈవో మారినప్పుడల్లా అమ్మవారి సొమ్మును కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారన్నారు. మీరు చేస్తున్నది అభివృద్ధికా లేక అవినీతికి మార్గం సుగమమం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే దసరా ఉత్సవాల్లో జనసేన ధార్మిక సేవ మండల వారికి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. మరొక ధార్మిక సేవ మండలి సభ్యులు తమ్మిన రఘు మాట్లాడుతూ వన్ టౌన్ పాత శివాలయం అభివృద్ధి పనుల కోసం మంజూరైన రూ.90 లక్షలు రంగులు వేయడానికి సరిపోయాయాని, అధికారులు రూ.90 లక్షలుతో ఏం అభివృద్ధి పనులు చేశారు? ఒక్క రంగులు వేయడం తప్ప..? ప్రశ్నించారు. పాలకమండలి తక్షణమే ఈ అభివృద్ధి పనులపై పర్యవేక్షించాలని అన్నారు. రూ.90 లక్షలను ఏ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించారో అధికారులు పాలకమండలి కలిసి శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హయాంలో రూ.90 లక్షల అభివృద్ధి పనులంటే శివాలయానికి రంగులు వేయడమేనా? అని అన్నారు. రూ.90 లక్షలతో ఎవరి చేతి వాటం ఎంతో దేవాదాయశాఖ మంత్రి సమాదానం చెప్పాలని, డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాలో ధార్మిక సేవ మండలి సభ్యులు పవన్ సాయి శర్మ, విజయ లక్ష్మి, ఉదయ లక్ష్మి, అడ్డగిరి పుల్లారావు, రమేష్, ఎం. కనకారావు, రమాదేవి, అన్నపూర్ణ  తదితురులు పాల్గొన్నారు.

See also  వ్యక్తిగత దూషణలు మానుకొని సేవలు చేయండి : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి