గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న శిఖబడి గ్రామ జనసైనికులు

శిఖబడి

                 విజయనగరం జిల్లా, కురుపాం నియోజవర్గం శిఖబడి గ్రామంలో మొట్టమొదటి జనసేన జెండా  గ్రామంలో  రెపరెపలాడించారు. జనసేన పార్టీ సిద్దాంతాలను, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి అని ఒక ముందస్తు అడుగుతో శిఖబడి గ్రామంలో జన సైనికులు జనసేన జెండాని ఆవిష్కరించడం జరిగింది.  జనసేన పార్వతీపురం కురుపాం యూత్ లీడర్ బాబు పాలూరి మరియు జనసేన సీనియర్ నేతలు ముఖ్య అథిధులుగా హాజరయ్యారు. జనసేన నాయకులు మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు.  నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

See also  Varahi Updates : How to improve 5 best Knowlwdge sites

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి