
శేరిలింగంపల్లి, డిసెంబర్ 6, (జనస్వరం) : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ రాష్ట్ర మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జి మాధవరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. శాంతియుత నిరసనలో పాల్గొన్న జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, దీనికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు పార్టీ జెండాకు పాలాభిషేకం చేసి పవన్‌కు దిష్టి తీశారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సానుకూల వాతావరణంలో ముందుకు సాగుతున్న సమయంలో ప్రాంతీయ విభేదాలు సృష్టించే చర్యలు స్వాగతించదగ్గవి కాదని హెచ్చరించారు. కుత్బుల్లాపూర్ జనసేన ఇంచార్జి నందగిరి సతీష్‌తో పాటు వివిధ డివిజన్ల అధ్యక్షులు అరుణ్, సరోజ్ ప్రదీప్, ప్రవీణ్ సాహు, హరినాయక్, రాజేష్, శ్రీకాంత్, రవితేజ, శ్రావణ్, సాయి కృష్ణ, శ్రీను, సుధాకర్, లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. వీరమహిళ విభాగం నుండి పుష్పలత, వెంకట లక్ష్మి, పద్మజ తదితరులు హాజరయ్యారు.








