జనసేనపార్టీ క్యాలెండర్ ను గడప – గడపకు అందచేసిన రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి

   తిరుపతి, (జనస్వరం) : చిత్తూరు జిల్లా, తిరుపతి నియోజకవర్గంలో జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు అద్దం పట్టేలా పార్టీ సిద్ధాంతాలు ప్రతిబింబించేలా 2022 క్యాలెండర్ రూపొందించి వాటిని ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఉంచేలా చేపట్టిన నగరి నాయకుల ఆశయానుసారం తిరుపతి నియోజకవర్గంలో నూతన సంవత్సరం క్యాలెండరును రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, వీరమహిళ చరిష్మా మరియు జనసైనికులు గడప – గడపకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనపార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లాలని, అలాగే రాబోయే రోజుల్లో జనసేనపార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.

See also  లక్కవరపుకోట మండలంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :