విద్యార్థులకు జాగ్రత్తలు కల్పించి పాఠశాలలు ప్రారంభించాలి : ఎమ్మిగనూరు జనసేన పార్టీ నాయకులు

విద్యార్థులకు జాగ్రత్తలు కల్పించి పాఠశాలలు ప్రారంభించాలి : ఎమ్మిగనూరు జనసేన పార్టీ నాయకులు

                     ఎమ్మిగనూరు పట్టణంలోని జనసేనపార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ అదేశాలమేరకు జనసేనపార్టీ నాయకులు రాహుల్ సాగర్, గాజుల వెంకటేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల పున:ప్రారంభించే ముందు విద్యార్థులు కరోనా భారిన పడకుండా అన్ని రకాల జాగ్రత్తలతో సదుపాయాలు కల్పించి ప్రారంభించాలని కోరారు. నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభించే ముందు ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ అధికారుల ద్వారా విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రభుత్వ ఉపాద్యాయులతో మరియు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి విద్యార్థులకు తల్లిదండ్రులకు కరోనా మహమ్మారి గురించి జాగ్రత్తలు వివరించి పున:ప్రారంభించాలని అన్నారు. ఎటువంటి నియమ నిబంధనలు తెలపకుండా పాఠశాలల ప్రారంభపు తేదీలను ప్రకటిస్తూ విద్యార్థుల జీవితాలతో అడుకోవద్దన్నారు. పాఠశాలల్లో తరగతుల వారిగా బోధన జరపాలని ఒక్కపూట మాత్రమే పాఠశాలలు జరుపుటకు ఎలాంటి ప్రణాళికల ద్వారా ముందుకు పోతున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదని ప్రభుత్వ పాఠశాలల్లో గదులకు మించిన విద్యార్థులు ఉన్నారని అరకొర గదులతో సామాజిక దూరం పాటించడం సాధ్యమవుతుంద అని ప్రశ్నించారు. కరోనా బారిన పడకుండా ముందస్తుగా పాఠశాలలకు శానిటైజర్లు, మాస్కులు, పంపిణీ చెయ్యాలని సమయపాలన మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించి ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలల్లో తప్పనిసరి శానిటేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు రాహుల్ సాగర్, రవి ప్రకాష్, షబ్బీర్, పాల్గొన్నారు. 

See also  జనసేన క్రియాశీలక సభ్యత్వం - భద్రమైన భవితవ్యం : జనసేన నాయకులు వబ్బిన శ్రీకాంత్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి