స్కూల్స్ తెరిచి పిల్లల్ని ప్రమాదంలోకి నెట్టేశారు : జనసేన నాయకులు కంచన శ్రీకాంత్

స్కూల్స్ తెరిచి పిల్లల్ని ప్రమాదంలోకి నెట్టేశారు : జనసేన నాయకులు కంచన శ్రీకాంత్

                     వైసీపీ ప్రభుత్వ అహంకార పూరిత, అనాలోచిత నిర్ణయాలకు పరాకాష్టగా నిలిచేది పాఠశాలలు తెరవడమే. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా అని అడిగితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా ఇచ్చిన నివేదికలో రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత ఉంది… ఆ పరిస్థితులు చక్కబడిన తరవాతే ఆలోచిస్తాం అన్నారు. అలాంటిది స్కూల్స్ ఎలా తెరిచారో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేశ్ గారు సమాధానం చెప్పాలని అన్నారు. స్కూల్స్ తెరవమని ప్రభుత్వాన్ని ఎవరు కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా స్కూల్స్ తెరవవద్దు అని చెప్పింది. కేంద్రం సూచనల్లోని ఇచ్చిన కొన్ని వెసులుబాట్లను చూపిస్తూ వైసీపీ ప్రభుత్వం స్కూల్స్ తెరిచి పిల్లల్ని ప్రమాదంలోకి నెట్టివేసింది. ఈ ప్రభుత్వానికి ప్రచార యావ పరాకాష్టకు చేరినట్లుగా ఉంది. తాము చేపట్టిన నాడు నేడు కార్యక్రమం ప్రచార చిత్రాల కోసం స్కూల్స్ తెరిచారేమో అనిపిస్తోంది. స్కూల్స్ కి పూర్తిస్థాయిలో శానిటైజర్లు, మాస్కులు ఇవ్వకుండా విద్యార్థులను రమ్మనడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని తెలియచేస్తోంది. యూరోప్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. మన దేశానికి కూడా ఆ ముప్పు ఉంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా ఈ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వం చెవికి ఏమీ ఎక్కడం లేదు. ఉపాధ్యాయులు, విద్యార్థులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి కోరుకొంటున్నానని తెలిపారు. వారికి జరగకూడనిది ఏదైనా జరిగితే విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేశ్ బాధ్యులవుతారన్నారు. పాఠశాలలు తెరిచిన నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని జనసేన పార్టీ తరఫున కంచన శ్రీకాంత్ డిమాండ్ చేసారు.

See also  రేబాల జడ్పీ హైస్కూల్‌లో ఘనంగా ‘మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్’