చండీగఢ్ కార్యక్రమంలో సతీష్ కుమార్ కు బెస్ట్ ప్రజెంటేషన్ అవార్డు

చండీగఢ్, అక్టోబర్ 12, (జనస్వరం) : సోషియో ఎకనామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ చండీగఢ్ లో జరుగుతున్న నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీట్ లో పాల్గొని విశేష ప్రాధాన్యత పొందారు. నాలుగు రోజులపాటు నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు బెస్ట్ ప్రజెంటేషన్ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుండి ఆహ్వానం పొందిన సతీష్ కుమార్, రాష్ట్ర రూరల్ డెవలప్మెంట్ మరియు గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పథకాలపై సమగ్ర వివరాలు ప్రజెంటేషన్ రూపంలో ప్రతిపాదించారు. ముఖ్యంగా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయితీ గూడెం గ్రామంలో విద్యుత్ సదుపాయాల కల్పనలో SER ఫౌండేషన్ మరియు కూటమి ప్రభుత్వం చేసిన కృషిని దృశ్యరూపంలో వివరించారు. కార్యక్రమంలో విభావాని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ NP రాజీవ్, ప్రొఫెసర్ రోషన్ లాల్, స్టేట్ కోఆర్డినేటర్ సుభద్ర తదితరులు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో SER ఫౌండేషన్ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను ప్యానెల్ సభ్యులు ప్రశంసించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను సమర్థవంతంగా ప్రదర్శించినందుకు సతీష్ కుమార్ ను అభినందించారు.

See also  పోలవరం బుడమేరు ముంపుకు గురయ్యే ప్రాంతంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వాసులకు ఇళ్ళు