పామర్రు నియోజకవర్గంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు

        పామర్రు, (జనస్వరం) : కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి అంబటి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరింగిశెట్టి కీర్తన  పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కీర్తన మాట్లాడుతూ జనసేనపార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు  ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కోరారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి రైతు కుటుంబంలోను సుఖసంతోషాలతో, సిరిసంపదలతో ఉండాలని కోరుకున్నారు. అలాగే ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  పవన్ కళ్యాణ్ పర్యటన అంటే వైసీపీ నాయకులకు భయం పట్టుకుంది : జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్