పారిశుధ్యంపై నిర్లక్ష్యం తగదు : ఎమ్మిగనూరు జనసేన నాయకులు గానిగ బాషా

పారిశుధ్యంపై నిర్లక్ష్యం తగదు : ఎమ్మిగనూరు జనసేన నాయకులు గానిగ బాషా

            ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్లలో గత కొద్దిరోజులుగా కురిసిన అకాల వర్షాల కారణంగా మురుగునీటి కాల్వలు పిల్ల కాల్వలను తలపించేలా ప్రవహిస్తూ కొన్ని విధుల్లో పారిశుధ్యం పడకేసిందని జనసేనపార్టీ నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల కేంద్రం గోనెగండ్లలో పలు వీధుల్లో చినుకు పడితే చాలు వర్షపు నీరు మురుగు కాల్వల్లో కలిసి ఇళ్ల ముందరకు చేరడంతో దుర్గంధపు వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పంచాయితీ అధికారులు మురుగునీరు నిల్వ ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్ వేయకపోవడం వలన ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదముందని అన్నారు. అదేవిధంగా మండల తహశీల్ధార్ కార్యాలయం కోసం అనునిత్యం పలు గ్రామాల ప్రజలు రాకపోకలు నిర్వహించే రహదారి బురద కుంటను తలపించేలా అద్వాన్నంగా మారడంతో వృద్దులు స్థానికులు కాలినడకన వస్తున్న గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా అధికారులు మాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని, గ్రామ పంచాయితీ అధికారులు నీటిపన్ను, ఇంటిపన్ను, అంటూ రకరకాల పన్నులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలు అనారోగ్యాల భారిన పడకుండా మురుగు నీరు నిల్వ ఉన్న ప్రతి చోట బ్లీచింగ్ పౌడర్ వేయించి ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేయించాలని డిమాండ్ చేశారు. 

See also  నిబద్ధతకు మారుపేరు కోమలపాటి సుధాకర్ బాబు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి