Search
Close this search box.
Search
Close this search box.

వృద్ధ కాపు పెద్దలకు ప్రణామములు..

   ఈ శతాబ్దంలో, ఇంత ఆధునిక యుగంలో కూడా కులం కోసం ఇంత తాపత్రాయ పడుతున్నారు అంటే మీరు వయసులో ఉన్నప్పుడు మీ రాతికాలంలో చాలా కుల సేవ చేసి ఉంటారు. మీరేమి చెయ్యలేదు మీరు వృద్ధనారీ పతివ్రతలు అని విమర్శలు తప్పు అని నమ్ముతూ మీరు ఇప్పుడు పెన్లో ఇంకు, పేపరు త్యాగం చేస్తూ కాపు జాతి కోసం చేస్తున్న పోరాటం చూస్తున్నాం.

మొట్ట మొదటిగా స్ట్రెయిట్ క్వశ్చన్.

    మీ కుల పోరాటంలోకి కులానికి అతీతంగా మన్ననలు పొంది అత్యున్నత స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ ని ఎందుకు లాగుతున్నారు? కౌలు రైతులకు సహాయం అందించినప్పుడు పవన్ కులం చూసాడా? లక్షలాది మంది అనేక విధాలుగా పవన్ ద్వారా లబ్ది పొంది ఉంటారు. వారి కులం ఏంటో సహాయం చేసేటప్పుడు ఆయన చూడలేదే? అటువంటి కులాతీత ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తిని మీ కులాల రొచ్చులోకి లాగి ఆయన్ని ఒక కులానికి పరిమితం చెయ్యాలని ఎందుకు చూస్తున్నారు? గాంధీగారు దేశానికి చేసిన సేవకు దేశం మొత్తం ఎంతో రుణపడి ఉంటుంది. వైశ్యలు మావాడు అని సంతోషపడతా ఉంటారు. కాపులు కూడా అలాగే అనుకుని అక్కడితో ఆగొచ్చు కదా? పవన్ కళ్యాణ్ ని పోట్లు పొడవటానికి, జగన్ని మొయ్యటానికి మాత్రమే మీ కులాభిమానం పరిమితం అయిపోయింది అనిపిస్తుంది.

మీకు కొన్ని ప్రశ్నలు.
      — కాపు రిజర్వేషన్ పోరాటం ఏమయ్యింది? బీజేపీ ఎంపీ GVL నరసింహారావు పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అది రాష్ట్రం పరిధి అంశం అని సమాధానం ఇచ్చారు. రాష్ట్రం చేతుల్లో లేదు అని జగన్ చెప్పింది అబద్దం అని పార్లమెంట్లోనే తేలినప్పుడు మీ లేఖలు ఏమయ్యాయి? కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉండగా బీసీ రిజర్వేషన్ అంటూ మాట్లాడిన ముద్రగడ తరువాత అనేక పదవులు చేసినప్పటికీ ఎప్పుడూ బీసీ ఊసు ఎత్తలేదు. చంద్రబాబు సీఎం అయ్యాక మొదలుపెట్టి జగన్ సీఎం అయ్యాక ఆపేసాడు. 2004లో వైస్సార్ సీఎం అయినప్పుడు కూడా మేనిఫెస్టోలో కాపులకు బీసీ రిజర్వేషన్ అని హామీ ఇచ్చి హామీ ఇవ్వని ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి రిజర్వేషన్ శాతం ప్రకారం సాంకేతికంగా కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేని పరిస్థితి తయారు చేసాడు. అప్పుడు ఎందుకు ఈ పెద్దలు నోరు విప్పలేదు
— ఈబీసీ కోటానుండి కాపులకు 5% రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు అసెంబ్లీలో తీర్మాణం చేసినప్పుడు వ్యతిరేకించని జగన్ అధికారంలోకి వచ్చాక తీసేస్తే లేఖలు ఎందుకు రాయలేదు
— కాపు కార్పొరేషన్ కి 10000 కోట్లు ఇస్తామని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఎన్నికల తరువాత చిల్లి గవ్వ విదల్చలేదని మీకు తెలుసా తెలియదా?
— కాపు విదేశీ విద్యాదీవెనకు ఇచ్చిన నిధులు – సున్నా
— కాపు కోర్పొరేషన్ ద్వారా కాపు యువకులకు ఇచ్చిన స్వయం ఉపాధి రుణాలు – సున్నా ( ఈ రుణాలు తీసుకుని కాపులు ఎక్కడ బాగుపడిపోతారో అని వాడి భయం అయి ఉండొచ్చు )
— దేవినేని కొడుకుని నెత్తిన పెట్టుకుని, రంగా కొడుకుని రాజకీయ సమాధి చేసినప్పుడు ఏమయ్యింది మీ కులాభిమానం?
— జనాభా నిష్పత్తి ప్రకారం 7 మంత్రి పదవులు దక్కాల్సిన కాపులకు 4 పదవులతో సరిపుచ్చి 1 దక్కాల్సిన రెడ్లకు 5 ఇచ్చినప్పుడు ఏమైపోయాయి లేఖలు?
— ఎప్పటినుండో బలిజలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజంపేట ఎంపీ సీటు మిథున్ రెడ్డికి మార్చేసినప్పుడు మీరు ఎవరూ ఎందుకు స్పందించలేదు?
— ఈ ఎన్నికల్లో రాయలసీమలో ఒక్క బలిజకు కూడా వైస్సార్సీపీనుండి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడం జగన్ బరితెగింపుకి నిదర్శనం. దాని పై స్పందించే ఉద్దేశం ఏమైనా ఉందా?

— మీ పెద్దలు అందరూ మీ రాజకీయ జీవితం మొత్తంలో ఒక్క కాపుకి అయినా ఏ పార్టులో అయినా మీ పరపతి వాడి MLA సీట్ ఇప్పించారా?
— ఒక్క నాయకుడిని అయినా వ్యక్తిగతంగా ప్రభావితం చేసి జనసేనలో జాయిన్ చేశారా? గత ఎన్నికల్లో మద్దతుగా ఒక్కచోట అయినా ప్రచారం చేసారా? ఒక్క ఓటు అయినా వేయించారా? కనీసం మీ ఓటు వేసారా? ఈ ఎన్నికల్లో అయినా చేస్తారా? ( చెయ్యరు అని మీకు కూడా తెలుసు).
— ఈ పెద్దల్లో ఒకరు ప్రజారాజ్యంలో వైస్సార్ పంచన చేరి పిఠాపురంలో పోటీ చేసి ఓడిపోయారు..ఇంకొకరు ప్రజారాజ్యంలో చేరి డామేజ్ చేసి బయటకు వచ్చి చిరంజీవి టికెట్లు అమ్ముకుంటున్నాడు అంటూ విమర్శలు చేసి వైస్సార్ పంచన చేరారు.

ప్రతీ సారి పవన్ కళ్యాణ్ ని పొడవటానికి మాత్రమే మీరు లేఖలు రాస్తున్నప్పటికీ పవన్ మాత్రం మీకు గౌరవం ఇస్తున్నాడు. స్వతహాగా ఆవేశపరుడు అయినప్పటికీ ఎక్కడా మీ మీద మాట తూలలేదు. తన అభిమానులు కూడా మీకు గౌరవం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాడు. దానిని దుర్వినియోగపరుచుకుంటున్నారు అని మీకు అనిపించట్లేదా? ఇప్పటికైనా మీరు మారతారు అని, మారి కాపులకు ఉపయోగపడే లేఖలు రాస్తారని ఆశిస్తూ.

మీ
 ట్విట్టర్ ( X ) :  @teluguchegu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

20240309_220628
నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం.. నమ్మకమైన స్వపక్షంగా జనసేన..
FB_IMG_1709197150391
ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం తనను తాను తగ్గించుకొన్న జనసేనాని
20240225_134850
నాయకుడు తీసుకున్న నిర్ణయం తప్పా ? రైటా??
జనసేన
జనసేన - నా సేన కోసం నా వంతు
జనసేనాని
ఓ జనసైనికా ఆలోచించు... జనసేనాని వెంట నడుచు...

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way