
గుంతకల్, ఏప్రిల్ 5 (జనస్వరం) : గుంతకల్ పట్టణంలోని కసాపురం రోడ్డులో అయ్యప్ప స్వామి ఆలయం పక్కన ఉన్న శ్రీ భగీరథ మహర్షి విగ్రహం వద్ద ఉప్పర (సగర) సంఘం ఆధ్వర్యంలో జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానితుడిగా గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొని మహర్షి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ సర్వ జీవులకు ప్రాణాధారమైన పవిత్ర గంగను దివి నుండి భువికి తీసుకువచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని కొనియాడారు. ఆయనను స్మరించడం, పూజించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా పట్టుదల ఎంత ముఖ్యమో భగీరథుని ప్రయత్నం ద్వారా తెలుస్తుందని అన్నారు. భగీరథ మహర్షి స్ఫూర్తితోనే ప్రభుత్వం సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కృషి చేస్తోందని తెలిపారు. భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడం మన సంస్కృతికి ఇచ్చే గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పర సంఘం అధ్యక్షులు గంగన్న, సాగర్ శ్రీనివాస్, ఏఎస్ఐ శ్రీనివాసులు, రమేష్, అడ్వకేట్ నాగశేషు, తిమ్మప్ప, కృష్ణమూర్తి, వినోద్, జనసేన పార్టీ పట్టణాధ్యక్షుడు బండి శేఖర్, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, ఆటో రామకృష్ణ, సుంకర నాగరాజు, సుబ్బయ్య, అమర్, గోవర్ధనగిరి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









