అమ్మాయిలకు రూ. 24 వేల సంతూర్ స్కాలర్‌షిప్.. అప్లై చేసుకోండి.

అమ్మాయిలకు రూ. 24 వేల సంతూర్ స్కాలర్‌షిప్.. అప్లై చేసుకోండి.

            ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి విప్రో సంస్థ సంతూర్‌ ఉపకారవేతనాలను అందిస్తోంది. తాజాగా ఈ స్కాలర్‌షిప్‌ ప్రకటన వెలువడింది. ఇంటర్‌ పూర్తిచేసిన అమ్మాయిలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం ఉన్న బాలికలను చదువులో ప్రోత్సహించడానికి విప్రో కన్సూమర్‌ కేర్, విప్రో కేర్స్‌ కలిసి 2016-2017 విద్యా సంవత్సరం నుంచి వీటిని అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల నుంచి ఏడాదికి 900 మందికి ఈ ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. గత నాలుగేళ్లలో 3600 మంది విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌ తోడ్పాటుతో ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు.

విప్రో స్కాలర్‌షిప్‌:

ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులకు మూడేళ్లు లేదా కోర్సు పూర్తయినంత వరకు ప్రతినెలా రూ. రెండువేల చొప్పున స్కాలర్‌షిప్‌ ఇస్తారు. డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ట్యూషన్‌ ఫీజులు, పుస్తకాలు, ఇతర సదుపాయాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు.

అర్హతలు:

1) పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజీల్లోనే చదివుండాలి.

2) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పేద బాలికలే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు.

3) 2019-20 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ లేదా సమాన స్థాయి కోర్సులు పూర్తిచేసినవారై ఉండాలి.

4) 2020-21లో ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరి ఉండాలి.

5) కనీసం మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న డిగ్రీ కోర్సుల్లో చేరినవారే ఈ స్కాలర్‌షిప్పు పొందడానికి అర్హులు.

6) హ్యుమానిటీస్, లిబరల్‌ ఆర్ట్స్, సైన్స్‌ కోర్సుల్లో చేరినవారికి, వెనుకబడిన జిల్లాలకు చెందినవారికి ఎంపికలో కొంత ప్రాధాన్యం ఉంటుంది.

7) అకడమిక్‌ మెరిట్‌ ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేస్తారు.

సంతూర్‌ స్కాలర్‌షిప్ ముఖ్య సమాచారం

దరఖాస్తు విధానం: అప్లికేషన్‌ ఫామ్‌ను సంస్థ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, ప్రింటవుట్‌ తీసుకోవాలి. అందులో పూర్తి వివరాలను నింపి పోస్టు ద్వారా పంపాలి. దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తుకు చివరి తేది: అక్టోబరు 31, 2020

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: విప్రో కేర్స్‌- సంతూర్‌ స్కాలర్‌షిప్, దొడ్డకన్నెల్లి, సర్జాపూర్‌ రోడ్డు, బెంగళూరు – 560035, కర్ణాటక.

వెబ్‌సైట్‌: http://www.santoorscholarships.com/

ఆసక్తిగల అభ్యర్థులు https://www.santoorscholarships.com/ పై క్లిక్‌ చేయండి.

ఈ పోస్ట్ మీకు ఉపయోగపడకపోవచ్చు. కానీ మీరు పనిచేస్తున్న గ్రామాల్లోని విద్యార్థినులకు ఉపయోగపడుతుంది. వీలైతే వారికి షేర్ చేయండి…!

See also  జగన్ రెడ్డి మాటలను తీవ్రంగా ఖండించిన ఆళ్ళగడ్డ నియోజవర్గం జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి